చివ్వేంల రాజకీయంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు ...!

సూర్యాపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఒకవైపు వివిధ పార్టీల అభ్యర్దులు ప్రచారంలో మునిగిపోతే మరోవైపు కిందిస్థాయి నాయకులు,కార్యకర్తలు పార్టీలు మారే పనిలో బిజీగా బిజీగా ఉన్నారు.సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది.

 Chivvemla Mandal Madhusudhan Reddy Joined Congress From Brs,chivvemla Mandal, Ma-TeluguStop.com

గంట గంటకు పార్టీ కండువాలు తారుమారవుతున్న చిత్రమైన రాజకీయం ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.చివ్వేంల మండల కేంద్రానికి చెందిన మధుసూదన్ రెడ్డి మధ్యాహ్నం బీఆర్ఎస్ లో చేరి,గంటల వ్యవధిలోనే తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు.

దీనితో ఏ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో?చివరికి ఏ పార్టీ కండువాతో కనిపిస్తారో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.మండలంలో ప్రస్తుతం కొనసాగుతున్న వలసలు కారణంగా ఓటర్లు ఎవరికీ ఓటేస్తారోననే అంశం అంతుచిక్కడం లేదు.

సర్వేలకు సైతం ఇక్కడి ఓటరు నాడి పట్టుకోవడం గగనంగా మారింది.రాజకీయాల్లో ఇలాంటి విపరీత ధోరణి ఇంతకు ముందెప్పుడూ చూడలేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube