సూర్యాపేట జిల్లా:పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం హాస్పిటల్( Hospital ) కి వెళుతూ ఉండగా గర్భిణీకి మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది నార్మల్ డెలివరీ( normal-delivery ) చేసి,తల్లీ బిడ్డలను క్షేమంగా హాస్పిటల్ కు చేర్చిన ఘటన శనివారం సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.
.మునగాల మండలం( Munagala ) వెంకట్రామపురం గ్రామానికి చెందిన కొండమీదీ మౌనిక అనే గర్భిణికి శనివారం ఉదయం పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు.
గ్రామానికి చేరుకున్న 108 ఆమెను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి.దీనితో ఆమెకు నార్మల్ డెలివరీ చేశామని,తల్లీ బిడ్డ క్షేమంగా ఏరియా ఆస్పత్రికి తరలించామని 108 ఈఎంటి ఇమాంపాషా తెలిపారు.
ఈ సందర్భంగా 108 సిబ్బంది ఈఎంటి ఇమాంపాషా,పైలట్ శోభన్ బాబులకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.