అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ:జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

సూర్యాపేట జిల్లా: లూయిస్ బ్రెయిలీ జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యపేట జిల్లా కలెక్టరేట్ నందు సోమవారం మహిళా శిశు,దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.ముందుగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.

 Letter Provider For The Blind, Louis Braille: District Collector S. Venkatarao ,-TeluguStop.com

వెంకట్రావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు.అనంతరం జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ అధ్యక్షతన లూయిస్ బ్రెయిలీ జన్మదిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ పడిన ఇబ్బంది కారణంగా బ్రెయిలీ లిపిని కనిపెట్టారని,బ్రెయిలీ లిపి ప్రాముఖ్యతను వివరించారు.

నేటి ప్రస్తుత సమాజంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తూ 175 ఏళ్ళ క్రితమే అంధ సమాజం కోసం లూయిస్ బ్రెయిలీ ముందు చూపుతో అలోచించి వారి జీవితాలలో వెలుగులు నింపారని కొనియాడారు.బ్రెయిలీ అంధుల కోసం 12 చుక్కలతో లిపి తయారు చేశారని,మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల కమిషన్ ఈవీఎం మిషన్లో బ్రెయిలీ లిపి కూడా పెట్టడం జరిగిందని ట్రైన్ లాంగ్వేజ్ ద్వారా అందరికీ తెలియజేశామని తెలిపారు.

కమిటీ సభ్యులు తెలిపిన విధంగా అన్నింటిని రాష్ట్ర నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపి వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు.ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పక అన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డిడబ్ల్యుఓ జ్యోతిపద్మ, ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి,డిఎం అండ్ హెచ్ఓ కోట చలం, వెంక రమణ,జిల్లాలోని అంధులు మరియు అంధుల సంఘాల ప్రతినిధులు,ప్రభుత్వ అంధ దివ్యాంగ ఉద్యోగులు పాల్గొనారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube