అధర్మంపై మాదిగల 30 ఏళ్ల ధర్మయుద్ధం గెలిచింది

సూర్యాపేట జిల్లా: ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ల పాటు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ చేసిన ధర్మ యుద్ధం చివరికి అధర్మంపై విజయం సాధించిందని ఎమ్మార్పీఎస్ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి బాలయ్య అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని డా.

 Madigas 30-year Righteous War Against Injustice Was Won, Madigas, Righteous War-TeluguStop.com

బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాజన నేత మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి,స్వీట్స్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేయాలని,ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో 1994 నుండి 2024 వరకు ఈ ఉద్యమాన్ని అనేక ఒడిదుడుకులు, అవమానాలు,ఆరోపణలు, వెన్నుపోట్లను తట్టుకొని నిలబడిందని,

ఈ దేశ చరిత్రలో సుదీర్ఘంగా సామాజిక ఉద్యమంగా 30 ఏళ్ల నుండి బలమైన పట్టుదలతో లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ సమర్థవంతమైన నాయకత్వం కలిగిన ఉద్యమం మరొకటి లేదన్నారు.

మాదిగల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ నిరంతరం జాతి పోరాటాన్ని ముందుకు నడిపేందుకు శ్రమించాడని, ఆయన కృషి ఫలితం ఈ రోజు వచ్చిందని కొనియాడారు.ఈ ఉద్యమంలో 30 ఏళ్ల నుంచి ఆయనను నమ్ముకొని నడిచి అమరులైన మాదిగ వీరులది,మాదిగ ఉద్యమకారులది,మాదిగ జాతి ప్రజలందరిదన్నారు.

ధర్మంపై అధర్మం ఏనాడైనా ఓడిపోక తప్పదని,దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే నిదర్శనమని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా, మండల నాయకులు, టి.ఎమ్మార్పీఎస్ నాయకులు,మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube