సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ప్రకృతి వ్యవసాయం ప్రచారకర్త, వ్యవసాయ జర్నలిస్టు మొలుగూరి గోపయ్య ( గోపి) బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాసి తపాలా కేంద్రం ద్వారా పంపించారు.ఈ లేఖలో గ్రామాలలో పట్టణాలలో రోజురోజుకు షుగర్, బీపీ,కిడ్నీ,క్యాన్సర్ లాంటి రోగుల సంఖ్య పెరుగుతున్నది.
ఈ రోగుల సంఖ్య పెరగడానికి కారణం మనం తీసుకునే ఆహారం.రైతులు పండించే పంట సాగులో రోజురోజుకీ విపరీతంగా క్రిమిసంహారకాలను ఉపయోగించడం జరుగుతున్నది.
దీనిని అరికట్టాలంటే క్షేత్రస్థాయిలో ప్రతి రైతు ఒక అరకరం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు, సమాజానికి ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి రైతులను ప్రకృతి వ్యవసాయంపై చైతన్య పరిచేందుకు ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం పితామహుడు పాలేకర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రంలో పలు గ్రామాల్లో అనేక మంది రైతులు కూడా ప్రకృతివ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
రైతులను చైతన్యపరిచేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక ప్రతినిధులు లేరు కాబట్టి, ప్రభుత్వం తరఫున
మండలం,డివిజన్,జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక సిబ్బందిని రైతులకు ఇన్పుట్స్ రూపంలో 35000 రైతులకు పప్పులపిండి,బెల్లం ఇతర పనిముట్లకు గాను ₹5000,25000మంది రైతులకు గాను ఆవులు కొనుగోలుకు గాను ఒక్కొక్క రైతు కు 20వేల రూపాయల చొప్పున ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది.తెలంగాణ రాష్ట్రంలో 600 క్లస్టర్లలో 35000 మంది రైతులకు తొలివిడతగా ఉపయోగపడుతుంది.
దీనికిగాను ఒక ఏడాదికి దాదాపు 150 కోట్లు ఖర్చు అవుతుంది.భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటినుండే ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలి.
తదితర వివరాలను పొందుపరిచారు.