గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:జిల్లాలోగంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పోలీసు తనిఖీలు చేపడుతున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) తెలిపారు.సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలువైన జీవితాలను ఈజీ మనీకి అలవాటుపడి బలిపెట్టవద్దన్నారు.

 Crackdown On Ganja Smuggling: Sp Rahul Hegde , Sp Rahul Hegde , Suryapet Distr-TeluguStop.com

చిన్న వయసులోనే అక్రమ సంపాదనకు జల్సాలకు అలవాటుపడి గంజాయి రవాణా చేసి పోలీసులకు పట్టుబడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

ఆదివారం జిల్లాలోని కోదాడ పోలీస్ స్టేషన్( Kodad Police Station ) పరిధిలో వాహన రామాపురం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఆంధ్రా నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ బస్సు నంబర్ PY 04 A 2544 లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఒక పురుషుడు,ఇద్దరు మహిళలను అదుపులకు తీసుకొని విచారించడం జరిగిందన్నారు.

మహారాష్ట్రకు చెందిన పండ్లు అమ్మే రాయగడ్ జిల్లా నివాసి అవదేశ్ చంద్రశేఖర్ వర్మ,అదే ప్రాంతానికి చెందిన గృహిణులు శైల ప్రదీప్ దండకర్,సారిక విలాస్ మోహితెలను అరెస్టు చేశామని చెప్పారు.

వారి వద్ద నుండి మొత్తం 50 కేజీల గంజాయి,30 వేల రూపాయల నగదు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

ఈనెల మూడో తేదీన చంద్రశేఖర్ వర్మ సారిక విలాస్ లు మహారాష్ట్ర నుండి రైలులో విశాఖపట్నం వెళ్లి శివారు ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న వారి నుంచి 50 కేజీల గంజాయిని లక్ష రూపాయలకు కొని 12 ప్యాకులుగా చేయించి నాలుగు లగేజ్ బ్యాగుల్లో సర్దుకుని విశాఖపట్నం( Visakhapatnam ) నుండి బిఎంసిసి ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ వెళ్లి అక్కడ నుండి మహారాష్ట్రకు వెళ్లి ఎక్కువ ధరకు గంజాయిని అమ్ముకొని లాభపడాలనే ఉద్దేశంతో ఈ చర్యకు ఉపక్రమించారన్నారు.అయితే రామాపురం క్రాస్ రోడ్ లో నల్లబండగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని, గంజాయి అక్రమ రవాణాదారులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కోదాడ డిఎస్పి బి.ప్రకాష్ జాదవ్,సిఐడి రామకృష్ణారెడ్డి,రూరల్ ఎస్సై సాయిప్రశాంత్,హెడ్ కానిస్టేబుల్ ఎస్కే.అబ్దుల్ సమద్ ను ఎస్పీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube