ఘనంగా మేడే వేడుకలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో సీపీఎం ఆధ్వర్యంలో 136 వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అరుణ పతాకాన్ని ఎగురవేసి మేడే సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పించారు.

 May Day Celebrations-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ ఎర్రజెండా చరిత్ర అని కొనియాడారు.ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక,కర్షక వర్గ కష్టజీవులందరూ ఒక్కటై జరుపుకునే శ్రామిక దినోత్సవం మేడే అని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.”ప్రపంచ కార్మికులరా ఏకం కండి”అనే నినాదంతో ఎగురుతున్న ఎర్రని జెండా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.మేడే దినోత్సవ వేడుకల స్పూర్తితో సూర్యాపేట జిల్లాలో ఎర్రజెండా నీడలో ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రజిత,కోట గోపి,ఎల్గూరి గోవింద్,నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,ధనియాకుల శ్రీకాంత్,వీరబోయిన రవి,ప్రజా సంఘాల నాయకులు ములకలపల్లి రాములు,మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube