మంత్రి జగదీశ్వర్ రెడ్డి( Minister Jagdeeswar Reddy ) పుట్టిన రోజు సందర్భంగా క్రీడా కప్ పేరుతో గ్రామాలలో హడావుడి చేస్తున్న మంత్రి అనుచరులు యువకులలో క్రీడా స్ఫూర్తి నింపకుండా ఎన్నికల తాయిలాలకు తెరలేపారని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్( Incharge Dharmarjun ) ఆరోపించారు.గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన తెలంగాణ జనసమితి సూర్యాపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడలు యువకుల్లో స్ఫూర్తిని నింపాలి కానీ,స్వార్థ ఎన్నికల రాజకీయాలకు వేదిక కాకూడదన్నారు.
క్రీడా సామగ్రి పంపిణీ పేరుతో,క్రీడల పేరుతో యువకుల డేటా సేకరిస్తూ ఆటల మాటున ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారని విమర్శించారు.ఈ క్రీడలు ప్రభుత్వ టోర్నీ కాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఏకంగా జిల్లా విద్యాధికారి, కలెక్టర్ చెప్పాడంటూ ప్రభుత్వ పిఈటిలందరూ ఈ టోర్నీలలో పాల్గొనాలని సర్క్యులర్ జారీ చేయడమే దీనికి నిదర్శనమన్నారు.
ఇప్పటికే దశాబ్ద ఉత్సవాల పేరుతో అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగులను తమ పార్టీ కార్యకర్తల్లా పని చేయించుకున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని,విలువలు ప్రధానమని హితవు పలికారు.జన సమితి కార్యకర్తలు అందరూ గ్రామాలలో అధికార పార్టీ అవినీతి అప్రజాస్వామిక విధానాలను ప్రచారం చేయాలని,తద్వారా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలను ప్రజాస్వామిక వేదికల్లా ఉపయోగించుకోకుండా అధికారం కొరకు వ్యాపారంగా మార్చడాని నిరసిస్తూ రాజకీయాల నుండి ఎన్నికల నుండి డబ్బు మధ్య దూరం చేయాలని కోరుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ సెమినార్లు సదస్సు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.పట్టణ పార్టీ అధ్యక్షుడు బంధన్ నాయక్( Bandhan Naik ) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్, జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య యాదవ్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారబోయిన కిరణ్ కుమార్ ముదిరాజ్,జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి శ్రీనివాస్,జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్,మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ రఫీ, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్,చివ్వెంల మండల అధ్యక్షుడు సుమన్ నాయక్, కోఆర్డినేటర్ మన్సూర్, పెన్ పహాడ్ మండల బాధ్యులు సూర్యనారాయణ, బచ్చలకూరి గోపి, సూర్యాపేటలో మండల కోఆర్డినేటర్ వలికి గోవర్ధన్, ఆత్మకూర్ (ఎస్) మండల నాయకులు సైదులు, యాకుబ్ రెడ్డి,పట్టణ నాయకులు పాండయ్య, బీసు స్వామి గౌడ్,కృష్ణ, మైనార్టీ నాయకులు అత్తర్ తదితరులు పాల్గొన్నారు.