సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్తు

సూర్యాపేట జిల్లా:సాంకేతిక విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.కిరణ్ కుమార్ అన్నారు.

 A Bright Future With Technical Education-TeluguStop.com

గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో బ్రెయినో విజన్ సంస్థ ఆధ్వర్యంలో 36 గంటల హాకథాన్ షాప్ ను ప్రారంభించి మాట్లాడారు.విద్యార్థులకు సాంకేతిక విద్య వర్క్ షాపు మెలకువలు,నైపుణ్యాన్ని పెంపొందిస్తాయన్నారు.

ఇటువంటి వర్కుషాప్ లు నూతన ఆవిష్కరణలను చేయుటకు దోహదపడతాయన్నారు.బ్రెయినో విజన్ సంస్థ సీఈఓ సాఫ్ట్వేర్ ట్రై నర్ డీ.గణేష్ నాగ్ విద్యార్థులకు అనేక మెళకువలు నేర్పించారన్నారు.ఇలాంటి శిక్షణతో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాల్లో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

కళాశాల సెక్రటరీ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ కాలంలో విద్యార్థులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి కళాశాల యాజమాన్యం పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.ఎం.రాజు,ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాంజీ,డా.వెంకటేష్,శివశంకర్,పీఆర్ఓ బీ.శ్రీనివాస్,భోధన,బోధనేతర సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube