సాంకేతిక విద్యతో ఉజ్వల భవిష్యత్తు
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:సాంకేతిక విద్యతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ డి.
కిరణ్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో బ్రెయినో విజన్ సంస్థ ఆధ్వర్యంలో 36 గంటల హాకథాన్ షాప్ ను ప్రారంభించి మాట్లాడారు.
విద్యార్థులకు సాంకేతిక విద్య వర్క్ షాపు మెలకువలు,నైపుణ్యాన్ని పెంపొందిస్తాయన్నారు.ఇటువంటి వర్కుషాప్ లు నూతన ఆవిష్కరణలను చేయుటకు దోహదపడతాయన్నారు.
బ్రెయినో విజన్ సంస్థ సీఈఓ సాఫ్ట్వేర్ ట్రై నర్ డీ.గణేష్ నాగ్ విద్యార్థులకు అనేక మెళకువలు నేర్పించారన్నారు.
ఇలాంటి శిక్షణతో రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాల్లో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.కళాశాల సెక్రటరీ ఎం.
చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ కాలంలో విద్యార్థులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా విద్యార్థుల అభ్యున్నతికి కళాశాల యాజమాన్యం పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.ఎం.
రాజు,ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాంజీ,డా.వెంకటేష్,శివశంకర్,పీఆర్ఓ బీ.
శ్రీనివాస్,భోధన,బోధనేతర సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.