ఈ జాగ్ర‌త‌లు తీసుకుంటే వర్షాకాలంలో జుట్టు రాల‌నే రాల‌దు!

మండే ఎండ‌ల నుంచి ఉప‌శ‌మనాన్ని అందించే వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.వ‌స్తూ వ‌స్తూనే త‌న‌తో పాటు ఎన్నో రోగాలను తీసుకువ‌స్తుంది.

 If You Take These Precautions Your Hair Will Not Fall Out During The Rainy Seaso-TeluguStop.com

అందుకే వ‌ర్షాకాలం అంటే తెగ‌ భ‌య‌ప‌డుతుంటారు.అయితే వ‌ర్షాకాలంలో వేధించే స‌మ‌స్య‌ల్లో హెయిర్ ఫాల్ ఒక‌టి.

మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే ఈ సీజ‌న్‌లోనే జుట్టు అధికంగా ఊడిపోతుంటుంది.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులే అందుకు కారణమంటున్నారు నిపుణులు.

మరి, హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడి జుట్టును సంరక్షించుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.ఆ జాగ్ర‌త్త‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు రాల‌డం త‌గ్గాలంటే కుదుళ్లు బ‌లంగా మార‌డం ఎంతో అవ‌స‌రం.అందుకోసం మీ రెగ్యుల‌ర్ ఆయిల్ ను లైట్‌గా హీట్ చేసుకుని త‌ల‌కు ప‌ట్టించి.సున్నితంగా కాసేపు మసాజ్ చేసుకోవాలి.వ‌ర్షాకాలంలో క‌నీసం మూడు రోజుల‌కు ఒక‌సారి అయినా త‌ల‌కు మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాల్ స‌మ‌స్య కంట్రోల్ అవుతుంది.

వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు మీ తలను పూర్తిగా క‌ప్పి ఉంచుకోవాలి.త‌ద్వారా జుట్టు వ‌ర్షంలో త‌డ‌వ‌కుండా ఉంటుంది.ఒక‌వేళ వ‌ర్షంలో జుట్టు త‌డిచిందంటే త‌ప్ప‌కుండా హెయిర్ వాష్ చేసుకుని పూర్తిగా ఆర‌బెట్టుకోవాలి.

Telugu Chemical, Care, Care Tips, Fall, Pack, Healthy Diet, Latest, Long, Rainy

కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూలు, హెయిర్ స్టైలింగ్స్ టూల్స్‌, హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.అలాగే డైట్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలను చేర్చుకోవాలి.ముఖ్యంగా గుడ్డు, పాలు, పెరుగు, నెయ్యి, ప‌సుపు, మెంతులు, పాల‌కూర‌, న‌ట్స్‌, అవ‌కాడో, మొల‌కెత్తిన విత్త‌నాలు, పెస‌లు, చిల‌క‌డ‌దుంప‌లు, అవిసె గింజ‌లు, దానిమ్మ‌, బొప్పాయి, జామ‌ వంటి ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఇవి జుట్టు కుదుళ్ల‌ను దృఢప‌రిచి ఊడ‌టాన్ని త‌గ్గిస్తాయి.

Telugu Chemical, Care, Care Tips, Fall, Pack, Healthy Diet, Latest, Long, Rainy

ఇక వారానికి ఒక‌సారి అయినా హెయిర్ ప్యాక్‌ను వేసుకోవాలి.అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ క‌రివేపాకు పొడి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకుని.త‌ల‌కు ప‌ట్టించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూతో త‌ల‌స్నానం చేయాలి.ఈ ప్యాక్ హెయిర్ ఫాల్‌ను కంట్రోల్‌ను చేయ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube