ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులను హడలిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) జట్టు తాజాగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( Royal Challengers Bengaluru ) జట్టుపై ఘోరంగా ఓడిపోయింది.అదికూడా సొంత గడ్డపై వరుస విజయాల తర్వాత టేబుల్స్ పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీపై ఓడిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.35 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ పై ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీ విజయం సాధించింది.రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తున్న ఎస్ఆర్హెచ్ బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలం కావడంతో వరుస విజయాలకు బ్రేక్ పడింది.
గురువారం నాడు జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లోను, ఇటు బ్యాటింగ్ లోను ఘోరంగా విఫలమైందని చెప్పాల్సిందే.
![Telugu Ipl, Kavya Maran, Srh Rcb-Latest News - Telugu Telugu Ipl, Kavya Maran, Srh Rcb-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/kavya-maran-reaction-viral-after-sunrisers-hyderabad-poor-performance-against-rcb-detailsa.jpg)
ఇక మ్యాచ్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బౌలింగ్ చేయగా ఆర్సిబిని నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులకు కట్టడి చేసింది.ఆ తర్వాత 207 పరుగుల భారీ లక్ష్య చేదనలో భాగంగా ఎస్ఆర్హెచ్ మొదట్లోనే వరుస వికెట్లను కోల్పోతూ వచ్చింది.అతి బీకర ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ కు క్యూ కడుతుండడంతో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్( Kavya Maran ) మొహం చిన్నబోయింది.
ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అబ్దుల్ సమద్( Abdul Samad ) ఔట్ అయిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.
![Telugu Ipl, Kavya Maran, Srh Rcb-Latest News - Telugu Telugu Ipl, Kavya Maran, Srh Rcb-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/kavya-maran-reaction-viral-after-sunrisers-hyderabad-poor-performance-against-rcb-detailss.jpg)
అసలు ఏంటి అక్కడ ఆడది మీరేనా.అన్నట్లుగా ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వైరల్ గా మారింది.అంతే కాదు ఇంగ్లీషులో ఫక్ అంటూ నిరాశకు లోనయింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఆటగాళ్ల వికెట్ల పడినప్పుడు ఎగిరి గంతేసిన ఆవిడ సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్లు పడుతుంటే మాత్రం అసహనానికి గురైంది.వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి
.