మే 1 నుంచి పలు ప్రముఖ దేశీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జీలను( Savings Account Service Charges ) మార్చనున్నాయి.యాక్సిస్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
ఇకపోతే బ్యాంకుల వారీగా ఏయే సేవల ఛార్జీలు మారాయో ఓసారి చూద్దాం.
ముందుగా యాక్సిస్ బ్యాంక్( Axis Bank ) విషయానికి వస్తే.
![Telugu Axis Bank, Icici Bank, Icicibank, Bank-Latest News - Telugu Telugu Axis Bank, Icici Bank, Icicibank, Bank-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Axis-Bank-revise-savings-account-charges.jpg)
ఏప్రిల్ 1 నుంచే బ్యాంకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల యొక్క టారిఫ్ విధానాన్ని సవరించింది.ఇక ప్రియారిటీ సేవింగ్స్ అకౌంట్( Priority Savings Account ) కు గతంలో ప్రతి త్రైమాసిక సగటు కనిష్ఠ బ్యాలెన్స్ పరిమితిని రూ.2 లక్షలుగా ఉంచగా.ఇప్పుడు దాన్ని నెలకు మాత్రమే సవరించింది.దీనిప్రకారం ప్రతినెల అకౌంట్ సగటు బ్యాలెన్స్ రూ.2,00,000 ఉండాలనామాట.ఒకవేళ లేకుంటే మాత్రం.ఖాతాను బట్టి గరిష్ఠంగా రూ.600 రుసుము వసూలు చేస్తారు.ఇక అనేక రకాల సేవింగ్స్ ఖాతాల్లో నెలకు రూ.25,000 వరకు థర్డ్ పార్టీ లావాదేవీలను( Third Party Transactions ) ఉచితంగా పొందవచ్చు.ఆ తర్వాత ప్రతి రూ.1,000 కి రూ.10 ల రుసుమును చెల్లించాలి.ఇక ప్రైమ్, లిబర్టీ సేవింగ్ ఖాతాల్లో నెలకు 5 లావాదేవీలు, లేదా గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే ఉచితం.ప్రెస్టీజ్ సేవింగ్ లో 5 లావాదేవీలు, గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు, అలాగే ప్రియారిటీలో 7 లావాదేవీలు లేదా గరిష్ఠంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి రుసుములను చెల్లించాల్సిన అవసరం లేదు.ఇది ఇళ్ల ఉండగా ఎవరికైనా శాలరీ అకౌంట్స్ ఉంటే వరుసగా రెండు నెలల పాటు శాలరీ ఖాతాలో వేతనం క్రెడిట్ కాకపోతే నెలకు రూ.100 చెల్లించాలి.
ఇక ఐసీఐసీఐ బ్యాంక్( ICICI Bank ) విషయానికి వస్తే.
![Telugu Axis Bank, Icici Bank, Icicibank, Bank-Latest News - Telugu Telugu Axis Bank, Icici Bank, Icicibank, Bank-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/ICICI-Bank-revise-savings-account-charges.jpg)
డెబిట్ కార్డు ఫీజులను ఏడాదికి రూ.200 గా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 గా నిర్ణయించింది.ఇక చెక్ బుక్( Cheque Book ) విషయంలో తొలి 25 చెక్ లు ఉచితంగా అందించనుండగా.ఆపై ప్రతీ చెక్ కు రూ.4 వసూలు చేస్తారు.డ్యూప్లికేట్, రీవ్యాలిడేషన్ కు రూ.100 గా, సిగ్నేచర్ అటెస్టేషన్ కొరకు ఒక్కో అప్లికేషన్‌కు రూ.100, ఈసీఎస్/ఎన్‌ఏసీహెచ్ డెబిట్ రిటర్నులో భాగంగా ఒక్కోసారికి రూ.500, స్టాప్ పేమెంట్ ఒక్కో చెక్‌కు రూ.100 లను వసూలు చేయనున్నారు.అలాగే ఖాతా మూసివేత, డెబిట్ కార్డు పిన్ రీజనరేషన్, డెబిట్ కార్డు డీ-హాట్‌లిస్టింగ్, బ్యాలెన్స్ సర్టిఫికెట్( Balance Certificate ), ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ వంటి సేవలకు ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు.
ఇక యెస్ బ్యాంక్( Yes Bank ) విషయానికి వస్తే.
![Telugu Axis Bank, Icici Bank, Icicibank, Bank-Latest News - Telugu Telugu Axis Bank, Icici Bank, Icicibank, Bank-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Yes-Bank-revise-savings-account-charges.jpg)
సేవింగ్స్ ప్రో మ్యాక్స్ అకౌంట్ లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.50,000 లేకుంటే గరిష్ఠంగా రూ.1,000 వరకు ఛార్జిను., అలాగే సేవింగ్స్ ప్రో ప్లస్, యెస్ ఎసెన్స్, యెస్ రెస్పెక్ట్ ఖాతాలలోరూ.25,000. లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జిలను, ఇక సేవింగ్స్ ప్రోలో రూ.10,000.లేదంటే గరిష్ఠంగా రూ.750 ఛార్జిలను, ఇంకా సేవింగ్స్ వాల్యూ( Savings Value ), కిసాన్ ఎస్‌ఏ ఆసీకాంట్స్ కు రూ.5,000.లేదంటే గరిష్ఠంగా రూ.500 ఛార్జిను., మై ఫస్ట్ యెస్ అకౌంట్ కు రూ.2,500.లేదంటే గరిష్ఠంగా రూ.250 ఛార్జిలను యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ లేకపోతే వసూలు చేయనున్నారు.వీటితోపాటు డెబిట్ కార్డు ఛార్జీల( Debit Card Charges ) విషయంలో కూడా ఎలిమెంట్: రూ.299 , ఎంగేజ్: రూ.399 , ఎక్స్‌ప్లోర్: 599 , రూపే (కిసాన్ అకౌంట్): రూ.149 లుగా వసూలు చేయనున్నారు.ఇక ఈ బ్యాంకు కార్డ్స్ ను ఇతర బ్యాంకుల ఏటీఎం లలో నెలకు 5 లావాదేవీలు ఉచితంగాను., ఆ తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.21, ఆర్థికేతర లావాదేవీకి గాను రూ.10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.