ఇప్పటికే సిద్ధం …మేమంతా సిద్ధం( Memantha Siddham ) పేరుతో బస్సు యాత్రల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి శ్రేణుల్లో ఉత్సాహం పెంచడంతో పాటు, జనాల్లోనూ వైసీపీపై మరింత ఆదరణ పెంచే విధంగా ప్రయత్నాలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ). జనాలు నుంచి, పార్టీ శ్రేణుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడం, టిడిపి, జనసేన,బిజెపిలు కూటమిగా ఏర్పడి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.
తమపై ఎన్ని విమర్శలు చేస్తున్నా.జనాలు అవేమి పట్టించుకోవడంలేదని, మళ్లీ వైసీపీ నే అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉన్నారనే విషయాన్ని జగన్ అంచనా వేస్తున్నారు.
సిద్ధం( Siddham ), మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి జనాల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు వస్తూ ఉండడంతో, మరోసారి ఎన్నికల ప్రచారానికి జగన్ సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభలు, మేమంతా సిద్ధం పేరుతో 22 రోజులు పాటు నిర్వహించిన బస్సు యాత్ర( YS Jagan Bus Yatra ) సక్సెస్ కావడంతో, ఈనెల 28 నుంచి, మే ఒకటో తేదీ వరకు జగన్ ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా సిద్ధం అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఏప్రిల్ 28 నుంచి ప్రారంభం అయ్యే జగన్ ఎన్నికల ప్రచారం ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనుంది.
జగన్ షెడ్యూల్ ఈ విధంగా( CM Jagan Campaign Meetings Schedule )…

ఈనెల 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రి, 12 గంటలకు వెంకటగిరి, 3 గంటలకు కందుకూరు నియోజకవర్గల్లో పర్యటిస్తారు.29వ తేదీన ఉదయం 10 గంటలకు చోడవరం నియోజకవర్గం, మధ్యాహ్నం 12.30 గంటలకు పి గన్నవరం, సాయంత్రం మూడు గంటలకు పొన్నూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు.30వ తేదీన ఉదయం 10 గంటలకు కొండేపి, మధ్యాహ్నం 12.30 గంటలకు మైదుకూరు, సాయంత్రం పీలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారు.మే ఒకటో తేదీన ఉదయం 10 గంటలకు బొబ్బిలి.
మధ్యాహ్నం 12:30 గంటలకు పాయకరావుపేట.సాయంత్రం ఏలూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.