ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల పొత్తు( TDP Janasena BJP Alliance ) పెట్టుకున్నాయి.పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్ల పంపకాలు పూర్తి చేసుకుని, పూర్తిగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యాయి.
టిడిపి, జనసేన తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిత్యం జనాల్లోనే ఉంటూ, ఎనకల ప్రచారంలో నిమగ్నం అవుతున్నారు.మండుటెండలను సైతం లెక్కచేయకుండా చంద్రబాబు భారీ బహిరంగ సభలు, రోడ్డు షోలలో పాల్గొంటున్నారు.
అయితే బిజెపిలో ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి( BJP Purandeswari ) మినహా పెద్దగా పేరున్న నేతలు ఎవరూ ఎన్నికల ప్రచారానికి రాకపోవడం, ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అంత ఆసక్తిగా లేరు అనే ప్రచారం జరుగుతుండడం, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పైన ఎక్కువ ఫోకస్ చేసి, అక్కడ మెజారిటీ ఎంపీ స్థానాలను( Majority MP Seats ) గెలుచుకోవడం పైనే దృష్టి పెట్టడంతో, ఏపీ విషయంలో బిజెపి అధిష్టానం పెద్దలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ఈ మేరకు ప్రధాన మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్( PM Narendra Modi Election Campaign ) ను ఖరారు అయినట్లు సమాచారం.వచ్చే నెల 3 ,4 తేదీలలో ప్రధాని ఏపీలో పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.3న పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించనున్నారట.అలాగే 4 వ తేదీన రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గల్లో( Anakapalli Constituency ) జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారని బిజెపి వర్గాలు పేర్కొంటున్నాయి.మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు.ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ( Vijayawada )లో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు.
నాలుగో తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు రాజమండ్రి సభలో పాల్గొంటారు.సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తే( PM Modi AP Tour ) అది తమకు కలిసి వస్తుందని టిడిపి, జనసేనలు అంచనా వేస్తున్నాయి.
ప్రధాని పర్యటనలో వైసీపీ( YCP )ని, జగన్ ను టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తారని, అది తమకు కలిసి వస్తుందని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ అంచనా వేస్తున్నారు.