మాజీ మంత్రి, జగన్ చిన్నాన్న వైస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి సుమారు ఐదేళ్లు అవుతున్నా.ఇప్పటికీ ఆయన హత్యకు సంబంధించిన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతూనే ఉంది.
ముఖ్యంగా వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ను టార్గెట్ చేసుకుని రాజకీయ ప్రత్యర్థులతో పాటు, సొంత కుటుంబానికి చెందినవారు తరచుగా విమర్శలు చేయడం, ఎన్నికల్లో దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకుని పదేపదే విమర్శలు చేయడం వంటివన్నీ వైసిపికి , జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.వివేక హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ చిన్నాన్న కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారని, మళ్లీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారని జగన్ సోదరి వైఎస్ షర్మిల( YS Sharmila) తో పాటు, వైఎస వివేకా కుమార్తె సునీత విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిల ఎన్నికల ప్రచారంలో ఈ విమర్శలతోనే జగన్ ను ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఒకవైపు షర్మిల, సునీతతో పాటు, టిడిపి, జనసేన ( TDP, Jana Sena )లు ఈ అంశంపైనే విమర్శలు చేస్తుండడంతో జగన్ ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.
మొదటిసారిగా వైఎస్ వివేక హత్య వ్యవహారంలో షర్మిల, సునీతలను ఉద్దేశించి జగన్ విమర్శలు చేశారు.
పులివెందులలో నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ తన చెల్లెలు పసుపు చీర కట్టుకుని ప్రత్యర్థులు దగ్గర మోకరిల్లుతున్నారని విమర్శలు చేశారు. వైస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajasekhara Reddy ) ఎవరి మీద అయితే సుదీర్ఘకాలం పోరాటం చేసారో వారితో చేతులు కలిపి, తనపై యుద్ధానికి దిగారని జగన్ మండిపడ్డారు.ప్రత్యర్ధులతో చేతులు కలపడమే కాదు, కుటుంబంలో చిచ్చుపెట్టేవారు వైస్ వారసులు ఎలా అవుతారంటూ ప్రజలను జగన్ ప్రశ్నించారు.
ప్రతిపక్షాల కుట్రలో నా చెల్లెళ్లు ఇద్దరు భాగస్వామ్యంలో అవడం బాధ కలిగించిందని జగన్ అన్నారు.వైఎస్సార్ వారసత్వం ఎవరికి వస్తుందని ఆయన ప్రశ్నించారు.
తన పైన తన కుటుంబ సభ్యులతోనే ఆరోపణలు చేయిస్తూ, తనను దెబ్బతీయాలని చూస్తున్న వారి చేతుల్లో పావులుగా మారారని, ఇంతకంటే ఏం చేయగలమని జగన్ ప్రశ్నించారు.తనకు అధికారం ఇచ్చింది తన కుటుంబ సభ్యులు ఆస్తులు సంపాదించుకోవడానికి కాదని, ప్రజలకు సేవ చేయడానికి, సంపాదనకు అడ్డుపడ్డానని తనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని, పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల ధైర్యం, ఒక సక్సెస్ స్టోరీ అంటూ జగన్ సెంటిమెంట్ రాజేసేప్రయత్నం చేశారు.వివేకానంద రెడ్డి ని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని, వివేకాను చంపిన వాళ్లతోనే చేతులు కలుపుతున్నారని జగన్ అన్నారు.వివేక చిన్నాన్నకు రెండో పెళ్లి అయ్యిందనేది వాస్తవమని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని, వైయస్ అవినాష్ రెడ్డిని రాజకీయంగా బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అవినాష్ అమాయకుడని అందుకే మళ్లీ టికెట్ ఇచ్చానని జగన్ క్లారిటీ ఇచ్చారు.