కొందరి జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది.పొడుగు జుట్టు అందాన్ని మరింత పెంచుతుంది అనడంలో సందేహం లేదు.
పొడవాటి జుట్టు కలిగినవారిని చూస్తే కాస్త అసూయ కలగడం సర్వసాధారణం.అందులోనూ పొట్టి జుట్టు కలిగిన వారు మరింత ఎక్కువగా బాధపడుతుంటారు.
మీ జుట్టు కూడా మరీ పొట్టిగా ఉందా.? ఎన్ని చేసినా పొడుగ్గా పెరగట్లేదా.? అయితే చింతే వద్దు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే మీ పొట్టి జుట్టు పొడుగ్గా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ లో ఒక గ్లాసు రైస్ ఉడికించిన తర్వాత వచ్చే గంజిని వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న అవిసె గింజల( Flax seeds ను వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు ఫ్రెష్ మునగాకు లేదా రెండు టేబుల్ స్పూన్లు మునగాకు పొడి వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆముదం ( Castor oil )వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ గ్రోత్ ( Hair growth )అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.పొట్టిగా ఉన్న మీ జుట్టు కొద్దిరోజుల్లోనే పొడుగ్గా ఒత్తుగా మారుతుంది.
అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల కురులు సిల్కీగా మారుతాయి.చుండ్రు సమస్య దూరం అవుతుంది.
జుట్టు చిట్లడం విరగడం వంటివి తగ్గుతాయి.మరియు జుట్టు రాలడం సైతం తగ్గుముఖం పడుతుంది.
కాబట్టి పొడవాటి మరియు ఒత్తైన జుట్టును కోరుకునేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







