సూర్యాపేట జిల్లా:చక్కని జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ఉపకరిస్తాయని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని 9వ వార్డు అంగన్వాడి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లడుతూ చిన్నారుల్లో వచ్చే అంగవైకల్య నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే ఫల్స్ పోలియో కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మూడు రోజులపాటు నిర్వహించే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని, అందరూ అందులో భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ నాయకులు గుండగని నాగభూషణం,అంగన్వాడి టీచర్ జానకమ్మ,వైద్య సిబ్బంది,ఏఎన్ఎం,ఆశా వర్కర్లు,అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.