సూర్యాపేట జిల్లాలో( Suryapet District ) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అర్ధరాత్రి సమయంలో లారీని వెనుక నుంచి వచ్చిన ఓ కారు( Car ) ఢీకొట్టింది.
ఖమ్మం ఫ్లై ఓవర్( Khammam Flyover ) మీద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాతపడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అలాగే మృతులు మహ్మద్ నవీద్, రాకేశ్ మరియు నిఖిల్ రెడ్డిలుగా గుర్తించారు.అయితే ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.