జుట్టు రాలడాన్ని అరికట్టే బెస్ట్ హోమ్ మేడ్ షాంపూ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!

జుట్టు( hair ) అధికంగా ఊడిపోతుందా.? హెయిర్ ఫాల్ కారణంగా రోజు రోజుకి మీ కురులు పల్చగా మారుతున్నాయా.? జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ షాంపూ జుట్టు రాలడాన్ని అరికట్టడం లో ది బెస్ట్ గా వర్కోట్ అవుతుంది.వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ షాంపూను వాడారంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

 Best Homemade Shampoo To Prevent Hair Fall! Home Made Shampoo, Hair Fall, Stop H-TeluguStop.com

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ షాంపూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు శీకాకాయ ( Shikakaya )వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు గింజ తొలగించిన కుంకుడు కాయలు( Soap Nuts ), ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు మరియు ఒక కప్పు అవిసె గింజలు( Flax seeds ) వేసుకుని విడివిడిగా పొడి చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్ట‌వ్‌ ఆన్ చేసి అందులో మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ ను పోసుకోవాలి.

అలాగే గ్రైండ్‌ చేసి పెట్టుకున్న శీకాకాయ‌, కుంకుడుకాయ, ఉసిరి పొడులు వేసుకొని 15 నిమిషాల వరకు ఉడికించాలి.

Telugu Homemadeshampoo, Care, Care Tips, Fall, Healthy, Latest, Natural Shampoo,

ఆ త‌ర్వాత‌ అవిసె గింజల పొడి కూడా వేసి మరో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకుంటే మన షాంపూ సిద్ధం అయినట్టే.ఈ షాంపూను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.

ఎన్ని రోజులైనా ఈ షాంపూను వాడవచ్చు.వారానికి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ షాంపూను కనుక వాడారంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం ప‌డుతుంది.

జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.

Telugu Homemadeshampoo, Care, Care Tips, Fall, Healthy, Latest, Natural Shampoo,

హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారికి ఈ న్యాచురల్ షాంపూ చాలా బాగా సహాయపడుతుంది.పైగా ఈ షాంపూను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.తలలో దుర‌ద‌, చికాకు, చెడు వాసన రావడం వంటి సమస్యలు నయం అవుతాయి.

తెల్ల జుట్టు వచ్చే రిస్క్ సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube