జుట్టు రాలడాన్ని అరికట్టే బెస్ట్ హోమ్ మేడ్ షాంపూ ఇది.. అస్సలు మిస్ అవ్వకండి!

జుట్టు( Hair ) అధికంగా ఊడిపోతుందా.? హెయిర్ ఫాల్ కారణంగా రోజు రోజుకి మీ కురులు పల్చగా మారుతున్నాయా.

? జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదా.? అయితే అస్స‌లు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ షాంపూ జుట్టు రాలడాన్ని అరికట్టడం లో ది బెస్ట్ గా వర్కోట్ అవుతుంది.

వారానికి రెండు సార్లు ఈ న్యాచురల్ షాంపూను వాడారంటే జుట్టు రాలడం దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ షాంపూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు శీకాకాయ ( Shikakaya )వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు గింజ తొలగించిన కుంకుడు కాయలు( Soap Nuts ), ఒక కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు మరియు ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) వేసుకుని విడివిడిగా పొడి చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్ట‌వ్‌ ఆన్ చేసి అందులో మూడు నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ ను పోసుకోవాలి.

అలాగే గ్రైండ్‌ చేసి పెట్టుకున్న శీకాకాయ‌, కుంకుడుకాయ, ఉసిరి పొడులు వేసుకొని 15 నిమిషాల వరకు ఉడికించాలి.

"""/" / ఆ త‌ర్వాత‌ అవిసె గింజల పొడి కూడా వేసి మరో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకుంటే మన షాంపూ సిద్ధం అయినట్టే.

ఈ షాంపూను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.ఎన్ని రోజులైనా ఈ షాంపూను వాడవచ్చు.

వారానికి రెండు సార్లు ఈ హోమ్ మేడ్ షాంపూను కనుక వాడారంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం ప‌డుతుంది.

జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి. """/" / హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారికి ఈ న్యాచురల్ షాంపూ చాలా బాగా సహాయపడుతుంది.

పైగా ఈ షాంపూను వాడటం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.తలలో దుర‌ద‌, చికాకు, చెడు వాసన రావడం వంటి సమస్యలు నయం అవుతాయి.

తెల్ల జుట్టు వచ్చే రిస్క్ సైతం త‌గ్గు ముఖం ప‌డుతుంది.

న్యూయార్క్ ఇండియా డే పరేడ్‌ : ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య రామమందిర నమూనా ..!!