గుడ్డు( egg ) ఒక సూపర్ ఫుడ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.సంపూర్ణ పోషకాహారం అయిన గుడ్డు ఆరోగ్యానికి అండంగా నిలుస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలకు గుడ్లు మంచి మూలం.అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ లో గుడ్డు కూడా ఒకటి.
అందువల్ల హెల్త్ పరంగా గుడ్డు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.దృష్టి, ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక మరియు మెదడు అభివృద్ధితో సహా వివిధ రకాల శారీరక విధులకు ముఖ్యమైన పోషకాలను గుడ్డు అందిస్తుంది.
అందుకే చాలా మంది రోజూ ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటూ ఉంటారు.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొన్ని కొన్ని ఆహారాలతో గుడ్డును కలిసి తీసుకోకూడదు.
ఆ ఆహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది పంచదారతో ( sugar ) కలిపి గుడ్డును తీసుకుంటూ ఉంటాయి.
ఈ అలవాటు మీకు ఉందా.అయితే వెంటనే మానుకోండి.
షుగర్ మరియు ఎగ్ ఒక చెత్త ఫుడ్ కాంబినేషన్.ఈ రెండిటినీ కలిపి తీసుకున్నప్పుడు విడుదలయ్యే అమైనో ఆమ్లం మానవ శరీరానికి విషపూరితంగా మారుతుంది.
మరియు రక్తంలో గడ్డలను సృష్టిస్తుంది.

అలాగే గుడ్డు తిన్నాక కొందరు టీ( tea ) తాగుతుంటారు.అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని కలిగిస్తుంది.నారింజ, నిమ్మ( Orange, lemon ) మొదలైన సిట్రస్ పండ్లను గుడ్లతో కలిపి తీసుకోవడం ప్రమాదకరం.
ఈ కాంబినేషన్ జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా మీ కడుపులో ఇబ్బందిని కూడా సృష్టిస్తుంది.

గుడ్డు తిని పాలు తాగడం లేదా పాలు తాగి గుడ్డు తినడం అనేది అందరికీ ఉన్న చాలా కామన్ అలవాటు.అయితే గుడ్డుతో పాటు సోయా పాలు మాత్రం అస్సలు తీసుకోకూడదు.ఈ కాంబినేషన్ మీ శరీరంలో ప్రోటీన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
అలాగే మాంసాహారంతో పాటు గుడ్లు తినకూడదు.చాలా హోటళ్లలో బిర్యానీ తో పాటు ఉడకబెట్టిన గుడ్లను అందిస్తారు.
అయితే మాంసాహారంతో గుడ్డు కలిపి తీసుకోవడం ప్రమాదకరం.గుడ్లు మరియు మాంసంలో అదనపు కొవ్వు మరియు ప్రోటీన్ ఉంటుంది.
ఈ కలయికను జీర్ణం చేయడం కష్టతరం అవుతుంది.ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటివి తలెత్తుతాయి.