Tea Turmeric :టీతో పాటుగా ఈ ఆహారాలు తిన్నారంటే ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నట్లే.. జాగ్రత్త!

ఉదయం లేవగానే టీ తాగే( Tea ) అలవాటు చాలా మందికి ఉంటుంది.ముఖ్యంగా భారతీయులకు టీతో విడదీయలేని సంబంధం ఏర్పడింది.

 These Foods Must Avoid Consuming With Tea Health-TeluguStop.com

ప్రజల దినచర్యలో టీ ఒక భాగం అయిపోయింది.టీ తోనే రోజు ప్రారంభించే వారు ఎంతో మంది ఉన్నారు.

అయితే ఉదయమే కాదు సాయంత్రం సమయంలో కూడా టీ తాగే అలవాటు ఉంటుంది.టీ తో పాటుగా స్నాక్స్ కూడా తింటుంటారు.

అయితే టీ తో పాటుగా ఏవి పడితే అవి స్నాక్స్ గా తిన్నారంటే ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నట్లే అవుతుంది.ముఖ్యంగా టీ తో పాటు కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Besan Foods, Tips, Iron Rich Foods, Latest, Tea, Turmeric-Telugu Health

పసుపు వేసి చేసిన‌ ఆహారాలతో టీ తాగడం మానుకోండి.టీ మరియు పసుపులో ఉండే రసాయన మూలకాలు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి.గ్యాస్ మరియు మలబద్ధకానికి కారణమవుతాయి.

అందువ‌ల్ల టీతో పాటుగా ప‌సుపు ఉన్న ఆహారాల‌ను తీసుకోకూడ‌ద‌ని ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి.అలాగే టీతో పాటు ఐర‌న్ రిచ్ ఫుడ్స్ ( Iron Rich Foods )ను పొర‌పాటున కూడా తీసుకోకూడ‌దు.

Telugu Besan Foods, Tips, Iron Rich Foods, Latest, Tea, Turmeric-Telugu Health

నట్స్‌, సీడ్స్‌, ఖ‌ర్జూరాలు, ఎండు ద్రాక్ష‌, ఆకుకూర‌లు, మీట్‌, శ‌న‌గ‌లు, బీట్స్ వంటి ఆహారాల్లో ఐర‌న్ రిచ్ గా ఉంటుంది.కాబ‌ట్టి, టీ తాగేట‌ప్పుడు ఈ ఆహారాలను అవాయిడ్ చేయాలి.ఎందుకంటే, టీలో టానిన్లు మరియు ఆక్సలేట్‌లు అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి ఇనుమును ముఖ్యంగా మొక్కలు ఆధారిత ఇనుము శోషణను నిరోధించగలవు.టీతో పాటుగా ప‌కోడాలు, బ‌జ్జీలు వంటి స్నాక్స్ ను తింటుంటారు.అయితే వీటిని శ‌న‌గ‌పిండితో త‌యారు చేస్తారు.

శనగపిండితో చేసిన చిరుతిళ్లను టీతో పాటు తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు ప‌డ‌తాయి.ఈ కాంబినేష‌న్ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

మలబద్ధకం మరియు అసిడిటీకి కారణమవుతుంది.కాబ‌ట్టి పొర‌పాటు కూడా టీతో పాటు శ‌న‌గ‌పిండితో త‌యారు చేసిన చిరుతిళ్ల‌ను తిన‌కండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube