Tea Turmeric :టీతో పాటుగా ఈ ఆహారాలు తిన్నారంటే ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నట్లే.. జాగ్రత్త!
TeluguStop.com
ఉదయం లేవగానే టీ తాగే( Tea ) అలవాటు చాలా మందికి ఉంటుంది.
ముఖ్యంగా భారతీయులకు టీతో విడదీయలేని సంబంధం ఏర్పడింది.ప్రజల దినచర్యలో టీ ఒక భాగం అయిపోయింది.
టీ తోనే రోజు ప్రారంభించే వారు ఎంతో మంది ఉన్నారు.అయితే ఉదయమే కాదు సాయంత్రం సమయంలో కూడా టీ తాగే అలవాటు ఉంటుంది.
టీ తో పాటుగా స్నాక్స్ కూడా తింటుంటారు.అయితే టీ తో పాటుగా ఏవి పడితే అవి స్నాక్స్ గా తిన్నారంటే ఏరికోరి సమస్యలు తెచ్చుకున్నట్లే అవుతుంది.
ముఖ్యంగా టీ తో పాటు కొన్ని ఆహారాలు అస్సలు తినకూడదు.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
పసుపు వేసి చేసిన ఆహారాలతో టీ తాగడం మానుకోండి.టీ మరియు పసుపులో ఉండే రసాయన మూలకాలు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయి.
గ్యాస్ మరియు మలబద్ధకానికి కారణమవుతాయి.అందువల్ల టీతో పాటుగా పసుపు ఉన్న ఆహారాలను తీసుకోకూడదని పలు నివేదికలు చెబుతున్నాయి.
అలాగే టీతో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ ( Iron Rich Foods )ను పొరపాటున కూడా తీసుకోకూడదు.
"""/" /
నట్స్, సీడ్స్, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష, ఆకుకూరలు, మీట్, శనగలు, బీట్స్ వంటి ఆహారాల్లో ఐరన్ రిచ్ గా ఉంటుంది.
కాబట్టి, టీ తాగేటప్పుడు ఈ ఆహారాలను అవాయిడ్ చేయాలి.ఎందుకంటే, టీలో టానిన్లు మరియు ఆక్సలేట్‌లు అనే సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి ఇనుమును ముఖ్యంగా మొక్కలు ఆధారిత ఇనుము శోషణను నిరోధించగలవు.టీతో పాటుగా పకోడాలు, బజ్జీలు వంటి స్నాక్స్ ను తింటుంటారు.
అయితే వీటిని శనగపిండితో తయారు చేస్తారు.శనగపిండితో చేసిన చిరుతిళ్లను టీతో పాటు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు పడతాయి.
ఈ కాంబినేషన్ జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.మలబద్ధకం మరియు అసిడిటీకి కారణమవుతుంది.
కాబట్టి పొరపాటు కూడా టీతో పాటు శనగపిండితో తయారు చేసిన చిరుతిళ్లను తినకండి.
వైరల్ వీడియో: ఏంటి భయ్యా కోతి ఇలాంటి పనులు చేస్తోంది