Iron Rich Fruits : ఈ ఐదు రకాల ఫ్రూట్స్ డైట్ లో ఉంటే రక్తహీనత బలాదూర్ అవ్వాల్సిందే!

రక్తహీనత( Anemia ).శరీరంలో రక్తం తక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి.

 These 5 Types Of Fruits Help To Get Rid Of Anemia-TeluguStop.com

అన్ని జబ్బులకు ముందస్తు లక్షణాలు కనిపించినట్లే రక్తహీనత తలెత్తినపుడు కూడా పలు లక్షణాలు కనిపిస్తాయి.నీరసం, అలసట, ఆయాసం, కాళ్ళ వాపులు, గుండె దడ, చర్మం పాలిపోవడం, కళ్ళు తిరగడం త‌దిత‌ర ల‌క్ష‌ణాల‌న్నీ రక్తహీనత బారిన పడ్డప్పుడు కనిపిస్తుంటాయి.

వీటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి మందులు వాడకుండానే రక్తహీనత నుంచి బయటపడొచ్చు.ముఖ్యంగా కొన్ని రకాల పండ్లు రక్తహీనతను తరిమి కొట్టడానికి అద్భుతంగా సహాయపడతాయి.

మరి ఇంకెందుకు లేటు ఆ పండ్లు( Best Fruits ) ఏవేవో తెలుసుకుందాం పదండి.

Telugu Anemia, Apple, Fruits, Guava, Tips, Latest, Pomegranate, Strawberry, Type

దానిమ్మ( Pomegranate ) రక్తహీనత బారిన పడినవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజుకు ఒక దానిమ్మ పండును తీసుకుంటే రక్తహీనత బలాదూర్ అవుతుంది.స్ట్రాబెర్రీ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

స్ట్రాబెర్రీ పండ్లలో ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.రోజు స్ట్రాబెర్రీ పండ్లను( Strawberries ) తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

రక్తహీనత దూరం అవుతుంది.ఐరన్ రిచ్ గా ఉండే పండ్లలో యాపిల్( Apple ) ఒకటి.

యాపిల్ ను నిత్యం తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి బయటపడవచ్చు.పైగా ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, మెదడు ఆరోగ్యం మరియు బరువు నిర్వహణలో సహాయపడే ఫైబర్, విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లతో సహా యాపిల్‌ పోషకాలకు మంచి మూలం.

Telugu Anemia, Apple, Fruits, Guava, Tips, Latest, Pomegranate, Strawberry, Type

అలాగే జామ పండు( Guava )లో కూడా ఐరన్ మెండుగా ఉంటుంది.రక్తహీనత తో బాధపడుతున్న వారు జామ పండ్ల‌ను డైట్ లో చేర్చుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇక పుచ్చకాయ( Water Melon )కు సైతం రక్తహీనతను తరిమికొట్టే సామర్థ్యం ఉంది.పుచ్చకాయలో వాటర్ తప్ప ఏమీ ఉండవని చాలా మంది భావిస్తుంటారు.కానీ ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ పుచ్చకాయలో ఉంటాయి.పుచ్చకాయను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరమవ్వడం తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube