హైదరాబాద్ లోని రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు( Radisson Drugs Party Case )లో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.డ్రగ్స్ కేసులో మీర్జా వహీద్ బేగ్( Mirza Waheed Baig ) ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
పాతబస్తీలో నివాసం ఉంటున్న మీర్జా వహీద్ కు హుక్కా గ్యాంగ్ ఉందని తెలుస్తోంది.ఐదు సంవత్సరాలుగా హుక్కా సెంటర్లకు మీర్జా వహీద్ అక్రమంగా హుక్కా సప్లై చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే హుక్కా వ్యాపారం నుంచి వహీద్ మీర్జా డ్రగ్స్ దందాలోకి దిగారు.డ్రగ్స్ కేసులో మీర్జా వహీద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు.ఇప్పటికే ఈ కేసులో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.







