ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ కోల్కత్తా ట్రైని డాక్టర్( Kolkata Trainee Doctor ) అత్యాచార సంఘటన.ఈ ఘటనపై రోజుకొక విషయం తెర మీదకి వస్తూనే ఉంది.
ఆస్పత్రిలోనే అత్యాచారానికి గురైన వైద్యురాలి శరీరంలో పెద్ద మొత్తంలో వీర్యం ఉన్నట్లుగా పోస్టుమార్టం రిపోర్టంలో అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో సదరు మహిళా వైద్యురాలి పై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ఓ నిందితుడని అదుపులోకి తీసుకొని., అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ ని సైతం విచారిస్తున్నారు పోలీసులు.
ఇకపోతే., ఈ సంఘటనపై తాజాగా ఓ మహిళ స్పందించిన తీరు ఇప్పుడు అందరిని ఆలోచించేలా ఉంది.
కోల్కతా మహా నగరంలోని సోనాగచ్చి( Sonagachhi ) ప్రాంతంలో ఉన్న రెడ్ లైట్ ఏరియాకి చెందిన ఓ మహిళ మహిళ వైద్యురాలపై జరిగిన సంఘటన పై మాట్లాడిన తీరు ఇప్పుడు అందరూ హృదయాలను గెలుచుకుంది.ఇక ఆ మహిళ ఏం మాట్లాడిందన్న విషయానికి వస్తే.కొన్ని నిమిషాల కామ కోరిక కోసం స్త్రీలను అత్యాచారం చేసి చంపే బదులు.వారందరూ రెడ్ లైట్ ప్రాంతాలను( Redlight Area ) సందర్శించాలని సదరు మహిళ కామాంధులకు సలహా ఇచ్చింది.
కామంతో విలవిలలాడిపోయే వారందరూ రెడ్ లైట్ ప్రాంతాలను సందర్శించి అక్కడ ఆడవాళ్ళ జీవితాలను బాగుపరచండి., అంతేగాని ఎంతో బాధ్యతాయుతంగా నడుచుకుంటున్న ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయడం ఏంటి అంటూ మాట్లాడంది.
రెడ్ లైట్ ఏరియా లో ఎక్కడ 20 రూపాయల నుండి 50 రూపాయలకు కూడా చేసే అమ్మాయిలు ఉన్నారని.కాబట్టి., దయచేసి బయట పరువుగా జీవించే అమ్మాయిలను టార్గెట్ చేసి వారని నాశనం చేసే ప్రాణాలు తీయొద్దు అంటూ ఆమె వేడుకున్న తీరు ఇప్పుడు అందర్నీ ఆలోచించేసేలా ఉంది.ఇక ఈ మాటలు విన్న సోషల్ మీడియా వినియోగదారులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.