వేలాడుతున్న కరెంట్ తీగలు తగిలి ఓ విద్యార్థి స్పాట్‌డెడ్.. మరొకరి పరిస్థితి విషమం..!

కరెంట్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొంటోంది.రోడ్లపై కరెంటు తీగలు యమపాశాల్లా వేలాడుతున్నా వాటిని ఏ విద్యుత్ అధికారి పట్టించుకోవడం లేదు.

 Video Of 2 Students Electrocuted After Touching Electric Wire Hanging Too Low In-TeluguStop.com

ఇదే నిర్లక్ష్యం ఇప్పుడు ఓ బాలుడికి ప్రాణాలను బలి గొన్నది.మరొకరి ప్రాణాపాయ స్థితిలోకి తోసేసింది.

ఈ దురదృష్టకర సంఘటన కడప జిల్లాలో( Kadapa District ) బుధవారం ఉదయం జరిగింది.ఇద్దరు విద్యార్థులు స్కూలుకి వెళ్తూ ఉండగా ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

వాళ్లు వెళ్లే అగాడి వీధిలో ఇంటర్నేషనల్ వెల్ఫేర్ మండపం దగ్గర ఒక హై టెన్షన్ కరెంటు తీగలు( High Tension Current Wires ) కిందకి జారాయి.అవి చాలా తక్కువ ఎత్తులో వేలాడుతూ పిల్లలకు తాకాయి.

ఈ పిల్లల్లో ఒకరు 10వ తరగతి, మరొకరు 8వ తరగతి చదువుకుంటున్నారు.ఈ ఇద్దరు విద్యార్థులు విద్యాసాగర్ స్కూల్‌కు సైకిల్‌పై వెళ్తుండగా, పొరపాటున హైటెన్షన్ వైర్లను తాకారు.

అంతే క్షణాల్లో తన్వీర్( Tanveer ) అనే విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు.ఈ పిల్లోడి శరీరం నుంచి పొగ రావడం, ఆ తర్వాత మంటల్లో కాలిపోవడం వైరల్ వీడియోలో చూడవచ్చు.

మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సీసీ కెమెరా ఫుటేజ్‌లో, ఇద్దరు పిల్లలు కరెంటు తీగను తాకి సైకిల్ నుంచి పడిపోయిన దృశ్యం కనిపిస్తోంది.కొద్ది సేపటికి అక్కడ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటం, ఒక బాలుడి శరీరం మంటల్లో అనుకోవడం కనిపించింది.

మరో బాలుడు కదలకుండా పడి ఉన్నాడు.

స్థానికులు వెంటనే కరెంటు తీగలను తొలగించడం వల్ల మరో ప్రమాదం జరగకుండా ఆపారు.కానీ, తన్వీర్‌ను కాపాడలేకపోయారు.ఈ సంఘటన వల్ల ప్రజలు, విద్యార్థుల కుటుంబాలు చాలా కోపంగా ఉన్నారు.

వారు విద్యుత్ శాఖ( Electricity Department ) అధికారుల నిర్లక్ష్యాన్ని కారణంగా చెబుతున్నారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

మరోవైపు, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

దీనిపై మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) కూడా స్పందించారు.“కడప అగాడి వీధిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్ (11) అనే చిన్నారి మృతి చెందిన ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను.

ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది.” అని లోకేష్ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై మంత్రి గొట్టిపాటి చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

ఈ ఘటనపై అధికారులను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.ఓ కేబుల్ ఆపరేటర్ కేబుల్ వైరు లాగటం వల్ల కరెంటు వైర్లు తెగిపడిందని ఆయన చెప్పారు.

దీని గురించి ఎవరికైనా చెప్పి ఉంటే ఈ పెద్ద ప్రమాదం తప్పి ఉండేదని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ఘటనలో మళ్ళీ పునరావడం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని ఆదేశించారు.మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రభుత్వాధికారులు తెలిపారు.అలాగే గాయపడ్డ విద్యార్థి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వాన్ని భరిస్తుందని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube