అదేంటో తెలియదు కానీ పాములు ఎక్కువగా టాయిలెట్ బేసిన్‌లోకి దూరిపోతుంటాయి.ఆ టాయిలెట్లు( Toilets ) వాడే వారి ప్రాణాలను రిస్క్ లో పడేస్తుంటాయి.
ఇప్పటికే ఎన్నో విషపూరితమైన పాములు టాయిలెట్ బౌల్లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాయి.అయితే ఇటీవల థాయ్‌లాండ్‌లో( Thailand ) ఒక వ్యక్తి తన ఇంటి బాత్రూమ్లో ఒక కొండచిలువ( Python ) దూరింది అనే విషయాన్ని గమనించలేకపోయాడు.
అతను టాయిలెట్ వాడుతుండగా ఆ పైతాన్ స్నేక్ అతనిపైకి దాడి చేసింది.పాము, అతనికి మధ్య భీకరమైన పోరాటం జరిగింది.
ఈ పోరాటంలో ఆ వ్యక్తి వృషణాలను పాము కరిచింది.దాంతో అతడు అల్లాడిపోయాడు.
అయినప్పటికీ, ఆ వ్యక్తి ఆ పాముతో పోరాడి గెలిచాడు.
టాయిలెట్ సీట్ పై కూర్చున్న కొన్ని సెకన్లకే అతని వృషణాలను సూదులతో పొడిచినట్లుగా అనిపించిందట.అతను సడన్‌గా తలెత్తిన తీవ్రమైన నొప్పితో అరవడం మొదలుపెట్టాడు.అతను ఏమైందో తెలుసుకోవడానికి కిందకు చూశాడు.
అంతే ఒక పెద్ద కొండచిలువ కనిపించింది.దాంతో షాక్ అయ్యాడు.
వెంటనే తేరుకొని అతను పామును చంపడానికి ప్రయత్నించాడు.ఈ సంఘటనను అతను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఈ వ్యక్తి తనకు జరిగిన భయంకరమైన సంఘటన గురించి ఫేస్బుక్లో వివరంగా పోస్ట్ చేశాడు.ఒక పాము అతన్ని కరిచినప్పుడు, తనను తాను రక్షించుకోవడానికి ఆ పామును చంపాల్సి వచ్చిందని చెప్పాడు.ఈ సంఘటన ఎంత భయంకరంగా ఉందో అతను వివరించాడు.అలాంటి సంఘటనలు ఎవరికైనా జరగవచ్చని, అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని అతను చెప్పాడు.అయితే ఈ ఘటన కచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగిందో తెలియ రాలేదు.ఈ లింక్ https://www.facebook.com/share/v/xX6E4Vg6Aub7oesR/?mibextid=oFDknk పైన క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.