ఇక్కడ విద్యార్దినిలే స్కావెంజర్లు...!

సూర్యాపేట జిల్లా: బంగారు తెలంగాణలో సర్కార్ బడుల్లో చదవాలంటే కేవలం చదివస్తే సరిపోదు, పని కూడా రావాలనే పద్దతిలో నడుస్తున్నాయి.అంటే ఇదేదో వృత్తి విద్యా కోర్సులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

 Here The Students Are The Scavengers In This Government School Details, Students-TeluguStop.com

ఇది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఈ బడిలో చదవాలంటే పిల్లలు స్కావెంజర్ల అవతారమెత్తి పాఠశాలని శుభ్రం చేయ్యాలని హెడ్ మాస్టర్ ఆదేశాలు జారీ చేయడంతో చేసేదేమీ లేక పసిపిల్లలే రోజు వారి విధులు నిర్వర్తించే బాధ్యతను తలకెత్తుకున్న సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గుమ్మడవెల్లి గ్రామంలో వెలుగు చూసింది.స్కావెంజర్లు లేకపోవడంతో పాఠశాల విద్యార్థులతో తరగతి గదులను శుభ్రం చేయించక తప్పడం లేదని హెడ్ మాస్టర్ చెప్పేదాకా వచ్చిందంటే సర్కార్ బడుల్లో చదువుల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది…!

పసి పిల్లలపై పని భారం వద్దే వద్దని ఓ పక్క అంతర్జాతీయ సంస్థలు నెత్తి నోరు బాదుకుంటుంటేమనం మాత్రం వాటిని నినాదాలుగా బడి గోడలపై రాసుకొని, పిల్లలపై పని భారం వేస్తున్న దయనీయ స్థితిలో ఉన్నామంటే తెలంగాణ రాష్ట్ర సర్కార్ బడుల్లో చదువుల పరిస్ఠితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు.

ఒకప్పుడు బాధ్యతలు నేర్పేందుకు పనులు చెప్పేవాళ్లు,ఇవాళ బానిసలను చేసేందుకు పనులు చెబుతున్నరు.తప్పంతా కళ్లుండి చూడలేని ప్రజలదా? ప్రజల పట్ట పగలే మోసం చేస్తున్న ప్రభుత్వానిదా…? ఆలోచించకపోతే సర్కార్ చదువు ఇక అదోగతే…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube