పాలకవర్గంతో పాటు సిబ్బందిని తొలగించాలి: కాంగ్రెస్ పార్టీ డిమాండ్

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని సహకార సంఘం బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగిందని, తక్షణమే పాలకవర్గంతో పాటు సిబ్బందిని కూడా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె.చాంద్ మియా( SK Chand Mia ) డిమాండ్ చేశారు.బుధవారం గరిడేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సహకార సొసైటీలో రైతుల) Farmers ) డబ్బులు సుమారు 20 లక్షల రూపాయల దోపిడీ చేశారాని,రూ.8లక్షలు దొంగతనం జరిగినట్టుగా పోలీసులు ధృవీకరించారని అన్నారు.రైతులకు వచ్చే సబ్సిడీలు, మందు కట్టల మీద,వడ్డీ మాఫీల మీద వచ్చిన డబ్బులను పాలకవర్గం మరియు సిబ్బంది,బ్యాంక్ సిబ్బందితో సంబంధం కలిగిన కొంతమంది బయటి వ్యక్తులు కలిసి ఈ డబ్బులను స్వాహా చేశారని ఆరోపించారు.

 Dismissal Of Staff Along With Ruling Class: Congress Party Demand, Congress Part-TeluguStop.com

>/br>

సొసైటీని,రైతులను మోసం చేసి బ్యాంక్ ని దివాలా తీపిస్తున్నారని,గత సంవత్సరం నుండి పాలకవర్గం,బ్యాంక్ సిబ్బంది,కొందరు వ్యక్తులు మార్కెట్ గోదాం నిర్మాణంలో నాబర్డ్ నిధుల నుండి దాదాపు 35లక్షల రూపాయలు దిగమింగి,డబ్బుల పంపకాలలోసిబ్బంది,పాలకవర్గం గొడవపడి వాటాలుగా పంచుకున్నారన్నారు.బ్యాంక్ లో సీసీ కెమెరాలు( CC cameras )లేకుండా సిబ్బంది, పాలకవర్గం కూర్చోడానికి ఏసీ మెషిన్స్ పెట్టుకొని బ్యాంక్ లొనే దావతులు చేస్తూ,ఏ తీర్మానం కావాలన్న 20వేలు నుండి 30వేలు కమిషన్స్ తీసుకోవడం వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవటం పరిపాటిగా మారిందన్నారు.

అలాగే దాంట్లో పని చేసే చీపర్లను పెట్టాలన్నా లంచాలు తీసుకుంటారని అన్నారు.రైతల డబ్బులను విచ్చలవిడిగా దగా చేసే ఇలాంటి అవినీతిపరులపై జిల్లా ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube