సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ ఎస్ఐ లవ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.జిల్లా కేంద్రంలోని “రాజుగారితోట” హోటల్ యజమాని నుంచి రూ.1.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.నిన్ననే సదరు ఎస్ఐ లవకుమార్ కు సూర్యాపేట రురల్ నుండి సూర్యాపేట వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.కానీ, ఈ రోజు బదిలీకి ముందు జేబు నింపుకునే క్రమంలో ఏసీబీకి అడ్డంగా దొరికారు.
ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.