సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే గన్ మెన్ శ్రీను నాయక్

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదానికి గురై పరిస్థితి విషమించిన వ్యక్తికి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గన్ మెన్ శ్రీ నాయక్ సమయస్పూర్తిని ప్రదర్శించి సిపిఆర్ చేసి శ్వాస అందించి శభాష్ అనిపించుకున్నారు.శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.

 Mla Gunman Srinu Naik Who Saved Life By Doing Cpr ,cpr,mla Gunman Srinu Naik ,ml-TeluguStop.com

అదే సమయంలో అటుగా వస్తున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఘటనా స్థలం వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ప్రమాదానికి గురైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఎమ్మెల్యే గన్ మెన్ అతనికి సిపిఆర్ చేయడంతో శ్వాస అందింది.

ఆనంతరం ఎమ్మెల్యే మానవత్వాన్ని ప్రదర్శించి దగ్గరుండి ఆ వ్యక్తిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.అతనికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.

బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు.మానవత్వంతో ప్రమాద స్థలానికి వచ్చిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని,సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన గన్ మెన్ శ్రీనివాస్ నాయక్ ను స్థానికులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube