సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం పీపానాయక్ తండాలో సోమవారం విద్యుత్ షాక్ తో గూగులోత్ వెంకన్న(45) అనే రైతు మృతి చెందాడు.రోజు మాదిరిగానే పశువులను మేపడానికి చేనుకు వెళ్లి ప్రమాదవశాత్తు వేలాడుతున్న సర్వీస్ వైర్ కు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుని భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై సైదులు తెలిపారు.మృతునికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.