మతోన్మాద బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17 నుండి 29 వరకు జరిగే జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు.శుక్రవారం మునుగోడు మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల సాధన కోసం కొట్లాడి సాధించుకున్న కార్మిక హక్కులను,చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు కంపెనీలకు ప్రజా ధనాన్ని దోచిపెట్టే విధంగా మోడీ చట్టాలను రూపొందించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
44 చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోర్సు,విద్యుత్ సవరణ బిల్లు పెట్టడం వల్ల సబ్సిడీలను విచ్చేసి కార్పొరేట్ శక్తులకు అమ్మ చూస్తున్నారని ఆరోపించారు.ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచి రోజుకు కనీస వేతనం 600 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులు పండించే అన్ని ఉత్పత్తులకు కనీసం మద్దతు నిర్వహించి కొనుగోలను గ్యారెంటీ చేయాలని పార్లమెంటులో చట్టం చేయాలన్నారు.జన చైతన్య యాత్ర జయప్రదం చేసేందుకు మండలాల్లో మండల సదస్సులు,జీపు ప్రచార జాతాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, కర్నాటి మల్లేశం,మండల కార్యదర్శిలు మిర్యాల భరత్,ఏర్పుల యాదయ్య, జేరిపోతుల ధనంజయ, సాగర్ల మల్లేష్,వ్యాసరాని శ్రీను,ముత్తిలింగం,కొమ్ము లక్ష్మయ్య,సిహెచ్.వీరమల్లు, నారగోని నరసింహ, సింగపంగా గౌరయ్య, యాట యాదయ్య, వేముల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.