డెక్కన్ భూ మాయను అడ్డుకున్న రైతులు

సూర్యాపేట జిల్లా:డెక్కన్ సిమెంట్ పరిశ్రమ భూములు చుట్టూ నిర్మిస్తున భారీ సోలార్ ప్రహరీ నిర్మాణాన్ని స్థానిక రైతులు అడ్డుకోవడంతో వివాదాస్పదంగా మారింది.పాలకవీడు మండలం భవానిపురంలో డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేశారు.అప్పటి వరకు తమ ఆధీనంలోని అటవీ,ప్రభుత్వ భూములను రైతులు 2007లో తిరిగి ప్రభుత్వానికే స్వాధీనం చేశారు.2010 లో మహంకాళిగూడెంలో సర్వే నెంబర్ 6 లో 10.36 ఎకరాలు, రావిపహాడ్ శివారులోని సర్వేనెంబర్ 31,38,84 లలో 107.34 ఎకరాలు కలిపి మొత్తం 118.30 ఎకరాలను రూ.3,56,25,000 లకు ప్రభుత్వం నుండి డెక్కన్ సిమెంట్ కొనుగోలు చేసింది.డెక్కన్ కొనుగోలు సమయంలో నిబంధనల మేరకు స్కూల్ బిల్డింగ్,ప్లేగ్రౌండ్,క్వాటర్స్,గ్రీన్ బెల్ట్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది.భూముల కొనుగోళ్లలో భారీ అవకతవకలకు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.

 Farmers Who Resisted The Deccan Land Grab-TeluguStop.com

స్థానిక అధికారులు,లోకల్ లీడర్లు అసలు రైతులకు తెలవకుండా డెక్కన్ సిమెంట్ కి అనుకూలంగా పని చేశారానే ఆరోపణలు వినిపించాయి.డెక్కన్ కి కట్టబెట్టిన సర్వే నెంబర్ 31/7,31/18 లలో 5 ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇవ్వలేదని,తామే సేద్యంలో ఉన్నామని,న్యాయం కోసం ఓ రైతు హైకోర్టుకి వెళ్ళాడంతో కోర్టు రైతుకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.డెక్కన్ కొనుగోలు చేసిన 118.30 ఎకరాల చూట్టూ సోలార్ కరెంట్ స్తంభాలుతో ప్రహరి గోడ నిర్మిస్తుండడంతో గండ్ర సైదయ్య అనే రెత్తు అలైనేషన్ భూముల్లోనే కాకుండా మా పట్టా భూమిలో ప్రహరి గోడ నిర్మిస్తున్నారంటూ పనులను అడ్డుకున్నారు.డెక్కన్ సిమెంట్ కి భూములు ఉన్నమాట వాస్తవమే కానీ,రైతుల ఆధీనంలోని భూమిని కూడా డెక్కన్ ఆక్రమిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు డెక్కన్ కొనుగోలు చేసిన భూముల సర్వే చేసి,ప్రభుత్వ మిగులు భూములను కాపాడాలని కోరుతున్నారు.

గండ్ర సైదయ్య,రైతు అవేదన:డెక్కన్ సిమెంట్ వారు కొన్న ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఇచ్చిన మాట వాస్తవమే.నాకున్న భూమిలో కొంత భూమిని ఇచ్చాను.

పక్కనే ఉన్న భూమి ఆడపిల్లలకు వరకట్నం కింద ఇచ్చాను.వారు ఇక్కడ లేకపోవడంతో వ్యవసాయం చేయడం లేదు.

పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి స్వాధీనం చేయలేదు.కొంత నా ఆధీనంలో ఉంది.

ఇప్పుడు అదే భూమిలో ప్రహరి గోడ నిర్మిస్తుండడంతో కుటుంబ సభ్యులతో కలిసి నిర్మాణ పనులు అడ్డుకున్నాం.డెక్కన్ సిమెంట్ సిజిఎం వివరణ:మా ఆధీనంలోని ప్రభుత్వ, అటవీ భూమిలో అధికారులు నిర్ణయించిన హద్దులమేరకే ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నాము.రైతులు ఆరోపిస్తున్నట్టుగా రైతుల భూములు లేవు.సబ్ డివిజన్ లో ఉన్న విస్తీర్ణంతో ప్రభుత్వం నుండి కొన్న భూములే.గతంలో ఈ భూములకు ఫినిషింగ్ ఏర్పాటు చేశాము.ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మిస్తున్నాము.

సర్వే నెంబర్ 6లో స్కూల్ బిల్డింగ్ నిర్మించాం,గ్రీన్ బెల్ట్ కూడా ఏర్పాటు చేశాం.ఇటీవల కోర్టుకెళ్లిన రైతుల భూములకు కోర్టు ఆర్డర్లో సబ్ డివిజన్ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube