మట్టి మాఫీయాపై చర్యలు తీసుకోవాలి: వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలోని పెద్దమ్మ మరియు గొర్రెకుంట చెరువుల్లో ఎలాంటి అనుమతులు లేకుండా జేసిబీలు,ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.మట్టి మాఫీయా చెరువుల్లో మట్టిని గతంలో కూడా తరలించారని, ఇప్పుడు కూడా గత మూడు రోజులుగా యధేచ్చగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని, అయినా అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఆమ్యామ్యాలకు అలవాటుపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

 Action Should Be Taken Against Soil Mafia Venkatesh Goud , Venkatesh Goud, Soil-TeluguStop.com

వెంటనే సంబంధిత అధికారులు మట్టి తరలిస్తున్న అక్రమార్కులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube