సూర్యాపేట జిల్లా: మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలో నిర్మిస్తున్న సిసి రోడ్లు,డ్రైనేజీ,ప్రభుత్వ కార్యాలయాల ప్రహరీ గోడల వంటి ప్రభుత్వ పనులకు ఇసుక కొరత ఉందనే సాకుతో డస్టును వాడుతున్నారని మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త చింతకాయల నాగరాజు
ఆరోపించారు.
ప్రభుత్వ కట్టడాల్లో( Government buildings ) ఇసుక బదులు డస్ట్( Dust ) వాడటం వల్ల నాణ్యతా లోపం ఏర్పడి కట్టిన వెంటనే కూలిపోతున్నాయని,అయినా మండల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, దీనితో ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుకకు బదులుగా డస్టు వినియోగించకుండా చర్యలు తీసుకొని,ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.