బ్రేక్ ఫాస్ట్ లో ఈ హై ప్రోటీన్ స్మూతీని తీసుకుంటే రోజంతా మీరు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు!

ఇటీవల కాలంలో చాలా మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్( Breakfast ) తయారు చేసుకునేంత సమయం ఉండడం లేదు.దీంతో నాలుగు బ్రెడ్ ముక్కలు తిని ఆఫీస్ కి లేదా పనికి వెళ్ళిపోతున్నారు.

 High Protein Smoothie For Energetic Day! ,high Protein Smoothie, Healthy Smoothi-TeluguStop.com

కొందరైతే కడుపు నింపుకోవడం కోసం బయట ఏదో ఒక ఫుడ్ ను తింటున్నారు.దీంతో శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందకుండా పోతున్నాయి.

ఫలితంగా మధ్యాహ్నానికి నీరసం, అలసట ఇబ్బంది పెడుతుంటాయి.వాటి ప్రభావం చేసే పనిపై పడుతుంది.

ఇతరులతో కూడా చాలా విసుగ్గా ప్రవర్తిస్తుంటారు.వీటన్నిటికీ చెక్ పెట్టాలన్నా.

రోజంతా మీరు ఫుల్ ఎనర్జిటిక్ గా పని చేయాలన్నా.మీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఇప్పుడు చెప్పబోయే హై ప్రోటీన్ స్మూతీ( High Protein Smoothie ) ఉండాల్సిందే.

Telugu Energetic Day, Energybooster, Tips, Latest-Telugu Health

ఈ స్మూతీ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.కేవలం పది నిమిషాలు కేటాయిస్తే ఈజీగా స్మూతీ తయారవుతుంది.నైట్ నిద్రించే ముందు ఒక బౌల్ లో ఆరు బాదం పప్పులు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.అలాగే స్మూతీ తయారు చేయడానికి అరగంట ముందు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్( Rolled Oats ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

స్మూతీ కోసం బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే బాదంపప్పును పొట్టు తొలగించి వేసుకోవాలి.ఆపై వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ), పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక కప్పు యాపిల్ ముక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తద్వారా మన హై ప్రోటీన్ స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Energetic Day, Energybooster, Tips, Latest-Telugu Health

బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక తీసుకుంటే మీ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు అన్ని పోషకాలు లభిస్తాయి.ఈ స్మూతీ మిమ్మల్ని రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా( Energetic ) ఉంచుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.పైగా ఈ స్మూతీ మీ మెదడు పనితీరును పెంచుతుంది.జ్ఞాపకశక్తిని సైతం రెట్టింపు చేస్తుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube