తెలంగాణలో ప్రభుత్వ విద్య పతనావస్థకు

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు మెరుగు పడతాయని అనుకున్నామని, కానీ,రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారుతుందని తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(టియుటిఎఫ్) ఉపాధ్యాయ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మేము చెప్పే ప్రతిపాదనలు పరిష్కరించాలన్నారు.

 Government Education In Telangana Is In Decline-TeluguStop.com

ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన టి యుటిఎఫ్ సమావేశంలో పలువురు నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు గత 4 ఏళ్లుగా బదిలీలు,7 ఏళ్ళుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా ఎంఈఓ పోస్టుల భర్తీ లేకపోవడంతో పాఠశాల విద్యాశాఖలో తీవ్ర సంక్షోభం నెలకొన్నదన్నారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత,ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత, మండలాల్లో ఎంఈఓల కొరత,పారిశుద్ధ్య సర్వీస్ పర్సన్స్ కొరత ప్రభుత్వ విద్యా వ్యవస్థను వేధిస్తోందన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవదిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు- మనబడి,ఆంగ్ల మాధ్యమం,ఎఫ్ఎల్ఎన్ తదితర పథకాలు పకడ్బందీగా అమలు జరగాలంటే అన్ని జిల్లాలకు డిఈఓ,అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి,డిఈఓ,డిప్యూటీ ఈఓ,ఎంఈఓ ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు.తక్షణమే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించి తదనంతరం ఏర్పడిన ఖాళీలకు ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని,37 జీవో బాధిత టీచర్స్ కి న్యాయం చేయాలని,జిఓ 317 ద్వారా చేపట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయ విభజన కారణంగా అనేకమంది జూనియర్ ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి,భార్యాభర్తలు దూరమయ్యారని అన్నారు.

జిఓ 317 కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు చేసుకున్న అప్పీల్స్ పరిష్కారం చేయటంలో అసాధారణ జాప్యం జరుగుతోందన్నారు.పాఠశాలలు ప్రారంభమైనా కుటుంబాలను స్థిరపరచుకోలేక తీవ్రమైన మానసిక వత్తిడికి లోనౌతున్నారని,జిఓ 317 అమలు కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు.జిఓ అమలు కారణంగా ఏర్పడిన సీనియారిటీ,స్పెషల్ క్యాటగిరీ,13 జిల్లాలతో సహా భార్యాభర్తల సమస్యలపై పెండింగ్ లో ఉన్న అప్పీల్స్ అన్నింటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రతకు ముప్పుగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) ను రద్దు పరచి దాని స్థానంలో పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను ప్రవేశపెట్టాలన్నారు.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.2020 ఏప్రిల్ నుండి సర్వీస్ పర్సన్స్ నియామకం లేక పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉందని,గ్రామ పంచాయతీ,మునిసిపాలిటీలకు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత అప్పగించినట్లు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు జరగటంలేదన్నారు.తక్షణమే సర్వీస్ పర్సన్స్ నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైన చోట విద్యా వాలంటీర్లను నియమించాలని,పాఠ్యపుస్తకాలు,ఏకరూప దుస్తులు ఇంకా పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందని కారణంగా వెంటనే అందించే ఏర్పాటు చేయాలని కోరారు.

పెండింగ్ లో ఉన్న డీఏ (డియర్ నెస్ అలవెన్స్)ను వెంటనే మంజూరు చేయాలని, వేతనాలను నెల మొదటి తేదీన విడుదల చేయాలని,సప్లిమెంటరీ బిల్లులను వరుసక్రమంలో జాప్యం లేకుండా మంజూరు చేసి,జడ్పీ జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ ఖాతాలను ఉమ్మడి జిల్లా నుండి కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube