రోజుకు ఐదు నిమిషాలు ఈ ఆసనం వేస్తే వెన్నునొప్పి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది.. తెలుసా?

వెన్నునొప్పి.మనలో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.కొంచెం పని చేసినా కూడా వెన్ను నొప్పి విపరీతంగా వస్తుంటుంది.అయితే ఎలాంటి సమస్యకైనా యోగ ఒక సహజ మెడిసిన్ లా పనిచేస్తుంది.అనేక రకాల వ్యాధులకు యోగాతో( yoga ) సులభంగా చెక్‌ పెట్టవచ్చు.

 This Yoga Pose Help To Back Pain Naturally , Yoga Pose, Back Pain, Latest-TeluguStop.com

అలాగే వెన్ను నొప్పిని ( Back pain )త‌రిమి కొట్టడానికి కూడా ఒక అద్భుతమైన ఆసనం ఉంది.అదే సీతాకోకచిలుక ఆసనం( Butterfly Pose ).

Telugu Pain, Butterfly Pose, Butterflypose, Tips, Latest, Yoga, Yoga Pose-Telugu

ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాల పాటు ఈ ఆసనం వేస్తే వెన్నునొప్పి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది.ఈ ఆసనం వేయడానికి ముందుగా నేలపై ఒక మ్యాట్ ని పరచండి.ఆ తర్వాత మ్యాట్ పై ప్రశాంతంగా కూర్చోండి.ఆ తర్వాత రెండు కాళ్ళను మోకాళ్ళ వరకు తెచ్చుకొని.పాదాలను ఒక దగ్గరకు చేర్చండి.ఆ తర్వాత రెండు చేతులతో అరికాళ్ళు పట్టుకుని సీతాకోకచిలుక రెక్కలు ఆడించినట్లు చేయాలి.

ఇలా ఐదు నిమిషాలు కనుక చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

Telugu Pain, Butterfly Pose, Butterflypose, Tips, Latest, Yoga, Yoga Pose-Telugu

ముఖ్యంగా ఈ సీతాకోకచిలుక ఆసనం ( Butterfly Pose )వేయడం వల్ల వెన్ను నొప్పి దెబ్బకు పరారైపోతుంది.అలాగే ఈ సీతాకోకచిలుక ఆసనం తో ఒత్తిడి నుంచి వేగంగా రిలీఫ్ పొందుతారు.డిప్రెషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.

రోజూ సీతాకోకచిలుక ఆసనం వేయ‌డం వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగ్గా సాగుతుంది.అధిక రక్తపోటు సమస్య నుంచి బయట పడతారు.

అంతేకాదు గర్భిణీలకు కూడా ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది.రోజుకు ఐదు నిమిషాలు పాటు ఈ ఆసనం వేస్తే లోయర్ హిప్, కండరాలు స్ట్రాంగ్ గా మారతాయి.

డెలివరీ కూడా సులభంగా అవుతుంది.కాబట్టి మీ రోజులో కనీసం ఐదు నిమిషాలు అయినా ఈ అద్భుతమైన సీతాకోకచిలుక ఆసనం కోసం వెచ్చించండి.

ఆరోగ్యంగా జీవించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube