అర్జున్, నీతు.భార్యా భర్తలు.ఇద్దరు సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్లే.ఇద్దరు తొలుత సినిమాల్లో కలిసి నటించనవారే.సినిమా షూటింగుల సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.అనంతరం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
ఆ రోజు పొద్దున 9 అయ్యింది.బెంగళూరులోని జయానగర్ ఏరియా.
వాతావరణం చాలా చక్కగా ఉంది.బెళగోడు కల్యాణ మంటపం సమీపంలో ఎంతో హడావిడిగా ఉంది.
అద్భుత అలంకరణంతో ఆ ప్రాంతమంతా చక్కగా కనిపిస్తుంది.మంగళవాయిద్యాలు లయబద్ధంగా మార్మోగుతున్నాయి.
ఎంట్రెన్స్ దగ్గర వచ్చిన అతిథులకు ఘన స్వాగతం అందుతోంది.పువ్వులు ఇచ్చి.
పన్నీరు చల్లి ఆహ్వానిస్తున్నారు.
ఆ కల్యాణ మండపం సమీపంలో భారీగా పోలీసులు ఉన్నారు.
ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.ఈ వేడుకకు ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వస్తున్నారు.
అంతే కాదు.సౌత్ ఇండియన్ టాప్ సెలబ్రిటీలు అక్కడికి చేరుకుంటున్నారు.
రాజ్ కుమార్, కైకాల సత్యనారాయణ, రాధిక, శరత్ బాబు, గిరి బాబు, రంగనాథ్, గొల్లపూడి మారుతీరావు, రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, సుదర్శన్, జయంతి, శరణ్య, హేమా చౌదరి, దర్శకులు దాస్, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు, నిర్మాతలు రామానాయుడు, ఎస్పీ వెంకన్నబాబు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా పలువురు హాజరయ్యారు.

పది గంటలకు కల్యాణ మంటపం కిటకిటలాడింది.అదే సమయంలో వేది మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ పురోహితుల ఆశీర్వచనాలు, బంధుమిత్రుల అక్షింతల మధ్య వరుడు అర్జున్, వధువు నీతూ మెడలో మూడుముళ్లు వేశాడు.అలా రమేశ్ బాబు కృష్ణగారి అబ్బాయి మూవీ హీరోయిన్ నీతూ.
యాక్షన్ కింగ్ అర్జున్ నిజ జీవిత భాగస్వామిగా మారిపోయింది.నీతూ, అర్జున్ కలిసి డాక్టర్ గారబ్బాయి సినిమా చేశారు.
ఆ సమచంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.వీరికి ఇద్దరు అమ్మాయిలున్నారు.
ఐశ్వర్య, అంజన.ప్రస్తుతం అర్జున్ సినిమాల్లో కొనసాగుతున్నా.
నీతూ మాత్రం వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యింది.