దళిత బంధు పంపిణీ చేసిన మంత్రి

సూర్యాపేట జిల్లా:దళితుల్లో విప్లవాత్మక మార్పు రావాలని,దళిత బంధు దేశంలో గొప్ప పథకమని, దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉందని లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం సూర్యాపేట రూరల్ రామన్నగూడెం గ్రామాల్లో దళితబంధు లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ టి.

 Minister Distributed By Dalit Bandhu-TeluguStop.com

వినయ్ కృష్ణారెడ్డితో కలసి మొదటి విడతగా యూనిట్లను అందచేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దళితులు ఆర్ధికంగా ఎదిగేందుకు ప్రభుత్వం దళిత సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

యూనిట్లు అందుకున్న లబ్ధిదారులు అన్ని రంగాల్లో ఆర్థిక వనరులు పెంచుకొని శాశ్వతంగా జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలో దాదాపు 12 వందల గురుకులాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు.

గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు ధీటుగా ముందుంచామని అలాగే రైతాంగానికి ఆదుకొని వ్యవసాయ రంగములో విప్లవాత్మక మార్పు తెచ్చామని అన్నారు.లబ్దిదారులకు 7 ట్రాక్టర్లు,6 మినీ వ్యాన్లు,5 కార్లు,2 పంట కోత మిషన్లు మొత్తం 20 యూనిట్లను 24 మంది లబ్దిదారులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీడీ భిక్షం,ఎంపిపి రవీంద్రరెడ్డి,ఎస్.సి కార్పొరేషన్ ఈడి శిరీష,ప్రత్యేక అధికారి శ్రీధర్ గౌడ్, తహశీల్ధార్ వెంకన్న,సర్పంచ్,లబ్ధిదారులు,ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube