సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలం శూన్య పహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం( Palle prakruthi vanam )లో పట్టుమని పది మొక్కలు లేకుండా, నేమ్ బోర్డు ముళ్ళపొదలో, మైదానం బీరుసీసాలతో దర్శనమిస్తుంది.గత రెండేళ్ళ నుండి ఇదే తరహా నిర్వహణ జరుగుతున్నా సంబంధిత అధికారుల మాత్రం పల్లె ప్రకృతి వనంలో పచ్చదం పరుచుకుందని ప్రగతి నివేదికలు పంపించడం గమనార్హం.
పాలకవీడు మండలం( Palakeedu mandal )లో కొన్ని గ్రామాల్లో పర్లేదనిపించినా కొన్ని గ్రామాల్లో కొనొకార్పస్ మొక్కలు వేసి మమః అనిపించారు.ప్రభుత్వం మొక్కల కోసం లక్షలు ఖర్చు చేస్తుంటే ఈ గ్రామంలో మాత్రం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందగా వ్యవహరించడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
కార్యదర్శి,మండల, ఉన్నతాధికారులు వచ్చినపుడు హడావిడి చేసి,వారు వెళ్ళాక యధావిధిగా ఉంటున్నారని,గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఉందా అని గ్రామస్తులు ఎదురు ప్రశ్నించడం చూస్తుంటేపరిస్థితి ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
గ్రామంలో ప్రకృతి వనం ఏర్పాటు చేయండి శూన్య పహాడ్ గ్రామ పంచాయితీలో పల్లె ప్రకృతి వనం అనేది లేదని, గ్రామంలో ఉందని కూడా కనీసంఎవరికీ తెలీదనిమండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నీమా నాయక్( Neema Naik )అన్నారు.
గతంలో దర్గా వైపు రోడ్ ప్రక్కన నిర్మాణ చేయాలని అధికారులు ప్రయత్నాలు చేయగా అటవీ అధికారులు అనుమతి ఇవ్వలేదన్నారు.మా గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారని తెలిపారు.