సూర్యాపేట జిల్లా:ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.బుధవారం ఆయన 121 వ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయం ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికు పట్టణ ఆర్యవైశ్య సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన హక్కులకోసం ఆత్మబలిదానం చేసిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని,ఎస్సీలకు ఆలయప్రవేశం,అస్పృశ్యతా నివారణ కోసం సైతం ఆయన అహింసాయుత పోరాటం చేశారని,వారి త్యాగాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి బాటలో నడవాలని సూచించారు.పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు పైడిమర్రి నారాయణరావు,పైడిమర్రి సత్తిబాబు,మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మా మధుసూదన్,టౌన్ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు,రోజరమని,వంగవీటి రామారావు, ఓరుగంటి ప్రభాకర్,గాదంశెట్టి శ్రీనివాసరావు,గరినే శ్రీధర్,నకిరేకంటి జగన్,పబ్బా గీత,గునుగుంట్ల సాయి,వెంపటి వెంకటేశ్వరరావు,మీలా సత్యనారాయణ,కుక్కడపు బాబు,రహీం,ఉపేందర్, ఖదీర్,రామారావు,గుండపుణేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.