సూర్యాపేట జిల్లా: శారీరక వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోట చలం అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించే అంతర్జాతీయ యోగా ర్యాలీకి ముందు కొంత విరామ సమయంలో ఆయన జిమ్ము సెంటర్లోని కొన్నింటిని చేసి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పరికరాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఈ సందర్భంగా కొందరిని జిమ్ చేసే వారిని ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట వైద్య సిబ్బంది భాస్కర్ తదితరులు ఉన్నారు.