సూర్యాపేట జిల్లా:తాటి చెట్టుపై నుండి జారిపడి గీత కార్మికుడికి గాయాలైన సంఘటన మోతె మండలం మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.బంధువులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారింగుల భిక్షం రోజూ వారి వృత్తిలో భాగంగా ఉదయం కల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి గాయాలైనట్లు తెలిపారు.
వెంటనే తోటి గీత కార్మికులు,కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విషయం తెలుసుకున్న పలువురు గీత కార్మికులు ఆసుపత్రిలో భిక్షం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.పేద కుటుంబమని రోజు కుల వృత్తి చేస్తేనే కుటుంబ పోషణ గడుస్తుందని సహాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు,గీత కార్మికులు పాల్గొన్నారు.