సినీ నటుడు మోహన్ బాబు దిష్టిబొమ్మ దహనం .

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి క్రాస్ రోడ్ లో నాయి బ్రాహ్మణ కులాన్ని,వారి వృత్తిని కించపరిచే విధంగా అగ్రవర్ణ అహంకారంతో అవమానకరంగా మాట్లాడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు దిష్టిబొమ్మను నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయి బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ అగ్రవర్ణ అహంకారంతో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చే చేశారు.

 Burning Of Effigy Of Movie Star Mohan Babu.-TeluguStop.com

ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సోదరులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు,ఎమ్మార్పీఎస్ నాయకులు,పూలే అధ్యయన వేదిక నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube