సినీ నటుడు మోహన్ బాబు దిష్టిబొమ్మ దహనం .

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి క్రాస్ రోడ్ లో నాయి బ్రాహ్మణ కులాన్ని,వారి వృత్తిని కించపరిచే విధంగా అగ్రవర్ణ అహంకారంతో అవమానకరంగా మాట్లాడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు దిష్టిబొమ్మను నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా పలువురు నాయి బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ అగ్రవర్ణ అహంకారంతో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చే చేశారు.

ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సోదరులు బీసీ సంక్షేమ సంఘం నాయకులు,ఎమ్మార్పీఎస్ నాయకులు,పూలే అధ్యయన వేదిక నాయకులు పాల్గొన్నారు.

ఏపీలో పెన్షన్ పంపిణీ పై చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు..!!