తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్:మంత్రి జగదీష్ రెడ్డి...!

సూర్యాపేట జిల్లా: బహుజన బాంధవుడు సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని,సర్వాయి పాపన్న యావత్‌ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 313వ వర్ధంతి వేడుకలకుఆయన ముఖ్యాతిథిగా హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

 Sardar Sarvai Papanna Goud Is A Symbol Of Telangana Heroism , Minister Jagadish-TeluguStop.com

అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని అన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని తెలిపారు.

అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తు చేశారు.పాపన్న జీవితం స్ఫూర్తిదాయకమని, తెలంగాణ ప్రభుత్వం పాపన్న వర్ధంతి నిర్వహించడం ద్వారా వెనుకబడిన వర్గాలకు సిఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని కొనియాడారు.

ఆత్మగౌరవం కోసం,వివక్ష, దురాభిమానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సర్వాయి పాపన్న స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.నిరంకుశ ‘రాచరిక పోకడలకు’వ్యతిరేకంగా సమాజంలోని బహుజన సమూహాలను ఏకం చేసి పాపన్న పోరాడారన్నారు.

సర్వాయి పాపన్న గౌడ్ చూపిన ఆత్మగౌరవ స్ఫూర్తిని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు.అనంతరం పాపన్న జయంతి,వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీ,బహుజన సంఘాల ప్రతినిదులు మంత్రి జగదీష్ రెడ్డిని సత్కరించారు.

గౌడ భవనానికి త్వరలోనే శంకుస్థాప: మంత్రి జగదీష్ రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గౌడ బంధువులకు మంత్రి జగదీష్ రెడ్డి తీపి కబురు అందించారు.వారం,పది రోజుల వ్యవధిలోనే రెండు కోట్ల రూపాయలతో గౌడ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ఎకరం నుండి రెండు ఎకరాల వరకు స్థల సేకరణ చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.మంత్రి ప్రకటనతో గౌడ సోదరులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాల అన్నపూర్ణ,వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్,ఎలిమినేటి అభయ్, భరత్ మహాజన్, బాషామియా,రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై.వీ, పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్,రాష్ట్ర నాయకులు మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్,చిన్న శ్రీరాములు,భైరు వెంకన్న గౌడ్,రామగిరి నగేష్, కక్కిరేని నాగయ్య గౌడ్, రాపార్తి శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube